ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి కృషి: మంత్రి
ABN , First Publish Date - 2022-12-07T23:36:04+05:30 IST
ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.
అర్వపల్లి, డిసెంబరు 7 : ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అర్వపల్లి శ్రీయోగానంద లక్ష్మీనృసింహస్వామి దేవాలయంలోని రాజగోపురం నిర్మాణ ప్లాన మ్యాప్‌ను ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నలమోతు భాస్కర్‌రావు, నోముల భరత, చిరుమర్తి లింగయ్యలతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా దేవాలయంలో మంత్రి జగదీ్‌షరెడ్డికి, ఎమ్మెల్యేలకు దేవాలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలుకగా స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిషోర్, మంత్రి జగదీ్‌షరెడ్డిలను గజమాలలతో ఘనంగా సత్కరించారు. దేవాలయ రాజగోపురాన్ని రూ.1.20 కోట్లతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు దేవాలయం చుట్టూ తిరిగి పరిఽశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, పీఎసీఎస్ చైర్మన కుంట్ల సురేందర్‌రెడ్డి, దేవాలయ చైర్మన చిల్లంచర్ల విద్యాసాగర్, సర్పంచ బైరబోయిన సునీతారామలింగయ్య, కనుకు శ్రీనివాస్, గుండగాని సోమే్‌షగౌడ్, ఉపసర్పంచ పులిచర్ల ప్రభాకర్, కడారి నరేష్, శంకర్, పుప్పాల శేఖర్, శైలేందర్, మొరిశెట్టి ఉపేందర్ పాల్గొన్నారు.