‘దళితబంధు’తో ఆర్థికాభివృద్ధి
ABN , First Publish Date - 2022-08-04T05:41:34+05:30 IST
దళితబంధు పథకంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి సూచించారు. మండలంలోని మొరిపిరాల గ్రామానికి మంజూరైన దళితబంధు యూనిట్లను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామానికి మంజూరైన 51 యూనిట్లలో లబ్ధిదారులు నిర్మించుకున్న పౌలీ్ట్రఫాం షెడ్లను ఆయన తనిఖీ చేశారు.
జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి
ఆత్మకూరు(ఎం), ఆగస్టు 3: దళితబంధు పథకంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి సూచించారు. మండలంలోని మొరిపిరాల గ్రామానికి మంజూరైన దళితబంధు యూనిట్లను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామానికి మంజూరైన 51 యూనిట్లలో లబ్ధిదారులు నిర్మించుకున్న పౌలీ్ట్రఫాం షెడ్లను ఆయన తనిఖీ చేశారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పఽథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం మొరిపిరాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో నిర్వహించిన స్నేహిత కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాం సుందర్, మండల ప్రత్యేక అధికారి రాజారాం, ఎంపీడీవో ఏరాములు, ఎం పీవో పద్మావతి, సర్పంచ్ సామ తిర్మల్‌రెడ్డి, హెచ్‌ఎంలు టి.గోపాల్‌రెడ్డి, వై.పద్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఏ. శేఖర్ తదితరులు పాల్గొన్నారు.