మునుగోడు ప్రజల ఆత్మగౌరవ ఉప ఎన్నిక
ABN , First Publish Date - 2022-08-19T05:59:49+05:30 IST
మునుగోడు ఉపఎన్నిక కేసీఆర్ ఆహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్రావు అన్నారు.

యాదాద్రి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉపఎన్నిక కేసీఆర్ ఆహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్రావు అన్నారు. భువనగిరిలో గురువారం జరిగిన పార్టీ పదాధికారులు, మండల పార్టీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న మునుగోడులో అమిత్షా పాల్గొనే బహిరంగసభను విజయవంతం చేయాలని పిలు పునిచ్చారు. మునుగోడులో ముందస్తుగానే రాజగోపాల్రెడ్డి బహిరంగ సభను ప్రకటించారని, టీఆర్ఎస్ కావాలనే ఈ నెల 20న నిర్వహి స్తుందన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి మా ట్లాడుతూ మును గోడు ఎన్నిక బీజేపీకి సెమీఫైనల్ లాంటిందన్నారు. సమావేశంలో బీజే పీ నేతలు కాశం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేషం, పొతంశెట్టి రవీందర్, పాశం భాస్కర్, అశోక్, కర్నాటి ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.