అంబరాన్నంటిన దసరా సంబురం

ABN , First Publish Date - 2022-10-07T06:28:21+05:30 IST

దసరా సంబరం బుధవారం అంబరాన్నంటింది.

అంబరాన్నంటిన దసరా సంబురం
యాదగిరిగుట్టలో శమీవృక్షానికి పూజలు చేస్తున్న భక్తులు

యాదాద్రి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దసరా సంబరం బుధవారం అంబరాన్నంటింది. ఉదయం నుంచే ఇళ్లన్నీ మామిడి తోరణాలు, పూలమాలలతో ముస్తాబు చేసి, ఘుమఘుమల వంటకాలతో వేడుకలను ప్రారంభించారు. చిన్నారుల టపాకాయల మోత, పెద్దల అలయ్‌భలయ్‌తో జిల్లావ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. ఆయుధ పూజచేసి ఆలయాలకు చేరుకొని, సాయంత్రవేళ పాలపిట్టను దర్శించుకున్నారు. శమీ వృక్షం వద్ద పూజల అనంతరం బంగారు ఆకు (జమ్మి ఆకు) తీసుకొని, ఒకరినొకరు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇక రాత్రివేళ మిరుమిట్లు గొలిపే కాంతులతో బాణాసంచా మోత నడుమ రావణాసుర ప్రతిమలను దహనం చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. 

Updated Date - 2022-10-07T06:28:21+05:30 IST