‘శ్రేష్ఠ’లో దుగినెల్లి విద్యార్థికి 356వ ర్యాంకు

ABN , First Publish Date - 2022-06-07T06:59:47+05:30 IST

కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన ఊట్కూరి అనీశ్వర్‌ 8వ తరగతి విద్యార్థికి పేద విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన శ్రేష్ఠ పథకంలో అర్హత పరీక్షలో దుగినెళ్లి విద్యార్థి 356 ర్యాంకు సాధించాడు.

‘శ్రేష్ఠ’లో దుగినెల్లి విద్యార్థికి 356వ ర్యాంకు
ఊట్కూరి అనీశ్వర్‌

కట్టంగూరు, జూన 6: కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన ఊట్కూరి అనీశ్వర్‌ 8వ తరగతి విద్యార్థికి పేద విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన శ్రేష్ఠ పథకంలో అర్హత పరీక్షలో దుగినెళ్లి విద్యార్థి 356 ర్యాంకు సాధించాడు. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్య కోసం 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ.1.30 లక్షల ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్రం శ్రేష్ఠ పథకాన్ని ప్రారంభించింది. అనీశ్వర్‌ నల్లగొండలోని సెయింట్‌ ఆల్ఫోన్సెస్‌ స్కూల్‌లో ప్రస్తుతం 8వ తరగతి పూర్తి చేశాడు. 9వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షలో 356వ ర్యాంకు సాధించి తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలోని మహర్షి స్కూల్‌లో సీటు సంపాదించినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఊట్కూరి సైదులు స రిత తెలిపారు. సీటు రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.  

Read more