విద్యార్థులకు ఎలాంటి లోటు రానివ్వొద్దు
ABN , First Publish Date - 2022-12-07T23:33:46+05:30 IST
ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఎలాంటి లోటులేకుండా చూడాలని కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు.
నూతనకల్ / చివ్వెంల, డిసెంబరు 7 : ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఎలాంటి లోటులేకుండా చూడాలని కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహాన్ని, గుండ్లసింగారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగనవాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. వసతి గృహాంలో రికార్డులను పరిశీలించి, మెనూ వివరాలను వార్డెనను అడిగి తెలుసుకున్నారు. వార్డెన స్థానికంగా ఉంటూ విద్యార్థుల ప్రగతిపై దృష్టి సారించాలన్నారు. గుండ్లసింగారం ప్రాథమిక పాఠశాలలో సీఆర్పీ జానకిరాములు విధులు నిర్వహిస్తుండగా ఉపాధ్యాయులు ఎక్కడికి వెళ్లారని అడిగి తెలుసుకున్నారు. అంగనవాడీ కేంద్రంలో విద్యార్థుల హాజరు, పౌష్టికాహార పంపిణీ విషయాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ జమీరుద్దీన, సర్పంచ తీగల కరుణశ్రీగిరిధర్‌రెడ్డి, ఆర్ఐ సుప్రజ ఉన్నారు. అదేవిధంగా చివ్వెంల మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనాన్ని, క్రీడా ప్రాంగణాన్ని కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ పరిశీలించారు. పల్లెలను పరిశభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో లక్ష్మి, ఎంపీవో గోపి, సర్పంచ సుధాకర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.