రక్తదానం ప్రాణదానంతో సమానం

ABN , First Publish Date - 2022-08-18T05:15:59+05:30 IST

రక్తదానం.. ప్రాణ దానంతో సమానమని ఎమ్మె ల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం
రక్తదానం చేస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి

భువనగిరి టౌన్‌, అగ స్టు 17: రక్తదానం.. ప్రాణ దానంతో సమానమని ఎమ్మె ల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరిం చుకొని భువ నగిరి జిల్లా ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబి రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ 3 నెలల కు ఒకసారి రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగు పడుతుం దని, ఈ దిశగా యువత ఆలోచించాలన్నారు. ప్రభు త్వం, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలను విరివిగా నిర్వహించాలన్నారు. డీఎంహెచ్‌వో మల్లిఖార్జున్‌రావు మాట్లాడుతూ రక్తదానం సామాజిక  బాధ్యతగా పరిగణించాలన్నారు. బ్లెడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు పెరగడం ద్వారా బాధితులకు సకాలంలో రక్తాన్ని అందించే అవకాశం ఉంటుందన్నారు. శిబిరంలో మొట్టమొదటగా కలెక్టర్‌ పమేలాసత్పథి రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌,  జిల్లా ఆసు పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చిన్నా నాయక్‌, డీప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ ప్రశాంత్‌, డాక్టర్‌ యశోద, ప్రోగ్రాం ఆఫీసర్లు పరిపూర్ణాచారి, డాక్టర్‌ పాపారావు, డాక్టర్‌ సుమన్‌ కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన 75మందికి అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. 

Updated Date - 2022-08-18T05:15:59+05:30 IST