బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే దమ్ముందా?

ABN , First Publish Date - 2022-10-08T06:16:39+05:30 IST

బీఆర్‌ఎస్‌నుంచి పోటీచేసే దమ్ముందా అని మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే దమ్ముందా?
ఎరగండ్లపల్లిలో మాట్లాడుతున్న వివేక్‌, పక్కన విశ్వేశ్వర్‌రెడ్డి

మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి 

మర్రిగూడ, అక్టోబరు 7: బీఆర్‌ఎస్‌నుంచి పోటీచేసే దమ్ముందా అని మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎరగండ్లపల్లి, లెంకెలపల్లి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగో డు ఉప ఎన్నికలో దమ్ముంటే బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయాలన్నా రు. దేశమంతా మునుగోడు ఉప ఎన్నిక వైపే చూస్తోందన్నారు.  తెలంగాణ పేరుతో గెలిచి బీఆర్‌ఎ్‌సను పెట్టి తెలంగాణను మూసివేయడానికి చూస్తున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబపాలనను అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మునుగోడు అభివృద్ధికోసమే కో మటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారని అన్నా రు. ఆయన వల్లే అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు భయపడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతారనే భయంతోనే మండలానికి ముగ్గురు మంత్రులు, గ్రామానికి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పంపారని చెప్పారు. ఈ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి ఎన్ని ఎత్తుగడలు వేసినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. నియోజకవర్గ ప్రజలు రాజగోపాల్‌రెడ్డి వైపే ఉన్నారని చెప్పారు. సమావేశంలో మర్రిగూడ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, తుల ఉమ, ఎరగండ్లపల్లి గ్రామ ఇన్‌చార్జి గోవర్థన్‌రెడ్డి, రాష్ట్ర కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శి యాట అమరేందర్‌రెడ్డి, పిట్టల శ్రీనివాస్‌, మాజీ జడ్పీటీసీ నేతరి యాదయ్య, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


పలు పార్టీల నుంచి బీజేపీలో చేరికలు 

నాంపల్లి మండలంలోని గట్లమల్లేపల్లి, నిమ్మతోటబావి, పెద్దాపురం గ్రామాల నుంచి కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలనుంచి సుమారు 100 మంది వివేక్‌ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏరెడ్ల రఘుపతిరెడ్డి, పూల వెంకటయ్య, సింగారపు గిరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్‌తోపాటు పలువురు ముఖ్య నేతలు తమ అనుచరులతో కలిసి పార్టీలో చెప్పారు.  

Read more