వరంగల్‌లో జిల్లా యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-11-19T01:08:30+05:30 IST

మానసిక సమస్యలతో మన స్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా కేంద్రం ధర్మారంలో జరిగింది.

వరంగల్‌లో జిల్లా యువకుడి ఆత్మహత్య
జయపాల్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)

వరంగల్‌, నవంబరు 18: మానసిక సమస్యలతో మన స్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా కేంద్రం ధర్మారంలో జరిగింది. వరంగల్‌ జీఆర్‌పీ సీఐ జి.నరేష్‌ కథనం ప్రకారం.. చింతలపాలెం మండలం మల్లచెరువు గ్రామానికి చెందిన ముడుసు జయపాల్‌ రెడ్డి(27)నాలుగు రోజుల క్రితం వరంగల్‌ జిల్లా ఊకల్‌ రాం నగర్‌ లోని బంధువుల ఇంటికి వచ్చాడు. మానసిక సమస్యతో మందులు వాడుతున్నాడు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి, రాత్రి వరకు తిరిగిరాలేదు. ఫోన్‌ చేసి స్వీచ్ఛాప్‌ వచ్చింది. బంధువులను వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ధర్మారం గేటు వద్ద మూడో రైల్వే లైన్‌లోలో పోలీసులు అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగు మందు డబ్బా ఉంది. దీంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహానికి ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యు లకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పరశురాములు తెలిపారు.

రు.

Updated Date - 2022-11-19T01:08:54+05:30 IST

Read more