15న జిల్లా స్థాయి సైన్స డ్రామా ఎంపిక పోటీలు

ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST

జాతీయ స్థాయి విశ్వేశ్వరయ్య ఇండస్ర్టియల్‌ అండ్‌ టెక్నాలజికల్‌ మ్యూజియం ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స మ్యూజియమ్స్‌, జాతీయ స్థాయి సైన్స డ్రామా ఫెస్టివల్‌లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలను ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.నారాయణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

15న జిల్లా స్థాయి సైన్స డ్రామా ఎంపిక పోటీలు

భువనగిరి టౌన, సెప్టెంబరు 8: జాతీయ స్థాయి విశ్వేశ్వరయ్య ఇండస్ర్టియల్‌ అండ్‌ టెక్నాలజికల్‌ మ్యూజియం ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స మ్యూజియమ్స్‌, జాతీయ స్థాయి సైన్స డ్రామా ఫెస్టివల్‌లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలను ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.నారాయణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్‌ లేదా తెలుగు మీడియంలో జిల్లాలోని 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఒక్కో పాఠశాల నుంచి 8 మందితో కూడిన జట్టుగా పోటీల్లో పాల్గొనవచ్చునని సూచించారు. ప్రధానాంశంగా మానవ జాతి ప్రయోజనం కోసం సైన్స, టెక్నాలజీ, ఉప అంశాలుగా వ్యాక్సిన్ల కథ, మహ్మరి సామాజిక శాస్త్రీయ సమస్య, జీవన నాణ్యతను అమలు చేయడానికి సాంకేతిక అవిష్కరణ ప్రాథమిక శాస్త్రాలు, స్థిరమైన అభివృద్ధి అంశాలుగా ప్రదర్శనలు ఉండాలని సూచించారు.  మరిన్ని వివరాలకు జిల్లా సైన్స అధికారి భరణికుమార్‌, సెల్‌ నెంబర్‌ 9000989726ను సంప్రదించాలన్నారు. 


Updated Date - 2022-09-08T05:30:00+05:30 IST