గొర్రెల పంపిణీని వెంటనే ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-12-07T00:41:57+05:30 IST

గొర్రెల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని గొర్రెల, మేకల పెం పకందారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కిరాణా ఫాన్సీ అసోసియేషన్‌ భవనంలో నిర్వహించిన గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం మహాసభలో ఆయన మాట్లాడారు.

గొర్రెల పంపిణీని వెంటనే ప్రారంభించాలి
మహాసభలో అభివాదం చేస్తున్న నాయకులు

సూర్యాపేట అర్బన్‌, డిసెంబరు 6: గొర్రెల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని గొర్రెల, మేకల పెం పకందారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కిరాణా ఫాన్సీ అసోసియేషన్‌ భవనంలో నిర్వహించిన గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం మహాసభలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని యాదవ , కరుమలకే కాకుండా, పట్టణ ప్రాంతాల్లో ఉన్న యాదవ, గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకాన్ని వర్తింపజేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు మట్టిపల్లి సైదులు, కడి యం లింగయ్య, వీరబోయిన రవి, రాజుల నాగరాజుయాదవ్‌, గోపనబోయినన రవి, మల్లేష్‌, యాదగిరి, శ్రీనివాస్‌, సైదులు, వెంకన్న, నరేష్‌, బిక్షం, మహేష్‌, జానయ్య, శ్రీశైలం నాగరాజు పాల్గొన్నారు.

అందజేశారు.

Updated Date - 2022-12-07T00:42:00+05:30 IST