నేటినుంచి బతుకమ్మ చీరల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-24T06:11:15+05:30 IST

జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ శనివారంనుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 515 కేంద్రాల్లో 2,67,824 మంది మహిళలకు 26 విభిన్న డిజై న్లు, 10 రంగులలోని చీరలను అందజేయనున్నారు.

నేటినుంచి బతుకమ్మ చీరల పంపిణీ

భువనగిరి టౌన్‌, భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 23: జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ శనివారంనుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 515 కేంద్రాల్లో 2,67,824 మంది మహిళలకు 26 విభిన్న డిజై న్లు, 10 రంగులలోని చీరలను అందజేయనున్నారు. ఇందుకోసం అధికారులు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంకంటే ఆకర్షనీయంగా, నాణ్యతగా చీరలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయి తే ఇండెంట్‌ కంటే సుమారు 35వేల చీరలు తక్కువగా జిల్లాకు వచ్చినప్పటికీ పంపిణీ పూర్తయ్యేలోపు మిగతా చీరలు వస్తాయని అర్హులందరికీ చీరలను అందిస్తామని అంటున్నారు. జిల్లా స్థాయి బతుక మ్మ వేడుకలకు భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణలో అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.  

Updated Date - 2022-09-24T06:11:15+05:30 IST