వ్యక్తి అదృశ్యం

ABN , First Publish Date - 2022-10-17T06:14:42+05:30 IST

దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. కోదాడ రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం...

వ్యక్తి అదృశ్యం

కోదాడ, అక్టోబరు 16:  దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. కోదాడ రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలం లోని రెడ్లకుంట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఆత్కూరి సైదులు ఈనెల ఆరో తేదీన గ్రామానికి చెందిన 50మందితో కలిసి దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి ఏపీ రాష్ట్రం జగ్గయ్యపేట సమీపంలోని వేలాద్రికి వెళ్లి తిరిగిరాలేదు. ఈ  మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. సైదులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.



Updated Date - 2022-10-17T06:14:42+05:30 IST