బంకులో డీజిల్‌తో పాటు నీళ్లు
ABN , First Publish Date - 2022-08-04T05:43:50+05:30 IST
మండల కేంద్రంలో రాఘవపురం క్రాస్‌రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో బుధవారం మధ్యాహ్నం డీజిల్‌తో పాటు నీళ్లు వచ్చాయి.
మేళ్ళచెర్వు, ఆగస్టు 3: మండల కేంద్రంలో రాఘవపురం క్రాస్‌రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో బుధవారం మధ్యాహ్నం డీజిల్‌తో పాటు నీళ్లు వచ్చాయి. దీంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. చింతలపాలెంకు చెందిన అమీర్ సాహెబ్ బొలేరో వాహనం, హేమ్లాతండాకు చెందిన భూక్య రవి ట్రాకర్లలో డీజిల్ కొట్టిస్తుండగా, డీజిల్‌తో పాటు నీరు వచ్చింది. గమనించిన వినియోగదారులు అందోళనకు దిగారు. ఈ సందర్భంగా బంకు నిర్వాహకులు మాట్లాడుతూ నిత్యం వందల సంఖ్యలో వాహనాలకు డీజిల్ కొడతామని, ఇప్పటివరకు ఇటువంటి ఫిర్యాదు రాలేదున్నారు. లోపాన్ని గుర్తించి మరోసారి ఇలా జరగకుండా చూస్తామన్నారు.