అన్నిమతాల అభివృద్ధే ధ్యేయం : విప్‌ సునీత

ABN , First Publish Date - 2022-08-04T05:42:36+05:30 IST

సర్వమతాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. బుధవారం మండలంలోని టంగుటూరులో రూ.4లక్షలతో నిర్మించిన నూతన అశ్రుఖానాను (పీర్ల కొట్టం)ను ఆమె ప్రారంభించి మాట్లాడారు.

అన్నిమతాల అభివృద్ధే ధ్యేయం : విప్‌ సునీత
గుట్టలో పార్టీ కార్యాలయ నూతన భవనంలో పూజల్లో పాల్గొన్న విప్‌ సునీత, డీసీసీబీ చైర్మన్‌ మహేందార్‌రెడ్డి

ఆలేరు రూరల్‌, యాదగిరిగుట్ట రూరల్‌, జూలై 3: సర్వమతాల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. బుధవారం మండలంలోని టంగుటూరులో రూ.4లక్షలతో నిర్మించిన నూతన అశ్రుఖానాను (పీర్ల కొట్టం)ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. సబ్బండవర్గాలు ఆనందంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కట్ట సమరసింహారెడ్డి, ఎంపీటీసీ జూకంటి అనురాధ, ఉపసర్పంచ్‌ నీల రామన్న, జూకంటి అనిల్‌, వెంకటేశం, శేఖర్‌రెడ్డి కుమార్‌, లక్ష్మీ, నర్సింహులు ఉన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనం గడప వద్ద విప్‌ సునీత, డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ భవనాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 

Updated Date - 2022-08-04T05:42:36+05:30 IST