అభివృద్ధి చేసి ఓట్లు అడగండి

ABN , First Publish Date - 2022-10-03T05:57:46+05:30 IST

గ్రామంలోని సమస్యలు పరిష్కరించి ఓట్లు అడగాలని, అప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ అడుగుపెట్టవద్దని మండలంలోని తేరట్‌పల్లి గ్రామానికి చెందిన బ్యాంక్‌ కాలనీ వాసు లు ఆదివారం పెక్సీ ఏర్పాటుచేశారు.

అభివృద్ధి చేసి ఓట్లు అడగండి
తెరట్‌పల్లిలో నిరసన తెలుపున్న గ్రామస్థులు

ప్లెక్సీ ఏర్పాటుచేసిన తేరట్‌పల్లి గ్రామస్థులు


చండూరు రూరల్‌, అక్టోబరు 2: గ్రామంలోని సమస్యలు పరిష్కరించి ఓట్లు అడగాలని, అప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ అడుగుపెట్టవద్దని మండలంలోని తేరట్‌పల్లి గ్రామానికి చెందిన బ్యాంక్‌ కాలనీ వాసు లు ఆదివారం పెక్సీ ఏర్పాటుచేశారు. కాలనీ రోడ్డు గుంతలమయంగా మారిందని, డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్లపైకి వచ్చి దోమల బెడద అధికమై రోగాలబారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పరిష్కరించాకే ఓట్లు అడిగేందుకు కాలనీకి రావాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు మలిగె ఆంజనేయు లు, వెంకటేష్‌, రమేష్‌, పెద్దులు, సత్తమ్మ, స్వా మి, రవితేజ, రాములు, రాజు, యాదగిరి, హరికృష్ణ, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more