పేదల ఇళ్లను కూల్చడం అన్యాయం

ABN , First Publish Date - 2022-06-30T08:04:17+05:30 IST

మండలంలోని మట్టపల్లిలో పేదల ఇళ్లను దౌర్జ న్యంగా కూల్చడం అన్యాయమని కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ధీరావత్‌ నవీన్‌నాయక్‌, ఆ పార్టీ మండల అధ్యక్షుడు భూక్య మంజూనాయక్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రామిశెట్టి అప్పారావు, పలువురు బాధితులు అన్నారు.

పేదల ఇళ్లను కూల్చడం అన్యాయం
మట్టపల్లిలో కూల్చివేసిన ఇళ్లను బాధితులకు కలిసి పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

 కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

బాధితులు ఫ మట్టపల్లిలో అధికారులు కూల్చివేసిన ఇళ్ల పరిశీలన 

మఠంపల్లి, జూన్‌ 29: మండలంలోని మట్టపల్లిలో పేదల ఇళ్లను దౌర్జ న్యంగా కూల్చడం అన్యాయమని కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ధీరావత్‌ నవీన్‌నాయక్‌, ఆ పార్టీ మండల అధ్యక్షుడు భూక్య మంజూనాయక్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రామిశెట్టి అప్పారావు, పలువురు బాధితులు అన్నారు. మట్టపల్లిలోని సర్వే నెం.1 పేదల ఇళ్లను రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో ఈనెల 27వ తేదీన 15 ఇళ్లను కూల్చివేయగా, బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ నాయ కులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దం క్రితం దళిత, గిరిజనులు ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్నారని, వారి ఇళ్లను అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు కూల్చడం ఆప్రజాస్వామికమన్నారు. 

 పులిచింతల ముంపు గ్రామమైన మట్టపల్లి వాసులకు సుల్తాన్‌పురం తండా వద్ద అధికారులు పునరావాసం కల్పించి 120మందికి పాట్లు కేటా యించి 43మందికి పట్టాలు ఇచ్చారన్నారు. అక్కడికి ఎవరూ వెళ్లనందున మట్టపల్లిలోని సర్వే నెం.1లో ఉన్న తొమ్మిది ఎకరాల్లో  120ప్లాట్లు కేటా యించినా ఎవరికీ పంపిణీ చేయలేదన్నారు. దీంతో సుమారు 35 మంది ఆ ప్లాట్లను ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకు న్నారన్నారు.  వీటిలో 15 గుడిసెలు ఉన్నాయన్నారు. ఈ పేదల గుడిసెలను అధికారులు తొలగించడం అన్యాయమ న్నారు. గతంలో గ్రామసభలో గుర్తించిన అర్హులకు, నేడు గుర్తించిన లబ్ధిదారుల జాబితాకు పోలికే లేదన్నారు. అర్హు లకు న్యాయం చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే జిల్లా, మండల స్థాయి అధికారులకు లేఖలు రాసినా న్యాయం జరుగలేదన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసు బలగాలతో తెల్లవారుజూమునే గ్రామానికి వచ్చి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేయించి, ఇళ్లను కూల్చివేయిం చడం అన్యాయమన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, లేనట్లయితే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో పార్టీ నాయకులు ఆదూరి కిషోర్‌రెడ్డి,  చిలక గురవయ్య, ఎస్‌.సైదులు, బచ్చలకూరి బాబు, సుకృ, బాలనాయక్‌, రామచంద్రయ్య, బాబునాయక్‌, ఎల్లారెడ్డి, .శ్రీను, మహేష్‌, కరీం, వెంకన్న నియోజకవర్గ, మండల నాయకులు  పాల్గొన్నారు.

బందోబస్తును పర్యవేక్షించిన ఎస్‌ఐ రవి

 మట్టపల్లి గ్రామంలో పర్యటనకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు  బుధవారం పిలుపు ఇవ్వడంతో మఠంపల్లి ఎస్‌ఐ ఇరుగు రవి ఆధ్వర్యంలో భారీ బందోబస్తుఏర్పాటు చేశారు. ఇరుపార్టీల వారు ఒకేసారి రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి ఘటనలు జరుగకపోవడంతో  పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు,

వర్షంలో తడుస్తున్నాం

ఇంటిని కూల్చివేయడంతో మూడు రోజులుగా వర్షంలో తడుస్తున్నాం. అధికార పార్టీ అండదండలతో అధికారులు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వలేదు.  మహిళనని చూడకుండా అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారు. కూల్చిన ఇళ్లను అధికారులు తిరిగి కట్టించి పేదలైన మమ్మల్ని ఆదుకోవాలి. 

 దార్ల కృష్ణకుమారి

వార్డు సభ్యుడు అసభ్యంగా మాట్లాడాడు

నేను చెప్పినట్లు చేస్తే స్థలం ఇవ్వడంతో పాటు ఇంటిని కట్టిస్తానని మట్టపల్లిలోని ఓ వార్డు మెంబరు అసభ్యంగా మాట్లాడాడు.  గతంలో నాకు అధికార పార్టీ నాయకులే స్థలం చూపించడంతో అక్కడే ఇంటిని నిర్మించుకుని ఉంటున్నాం. నన్ను అరెస్టు చేసి ఇంటిని కూల్చిడం వేయడం దుర్మార్గం. 

 దార్ల రమాదేవి

మూడు రోజులుగా పస్తులుంటున్నాం

అధికార పార్టీ నాయకులు పోలీసుల అండదండతో ఇంటిని కూల్చడంతో మూడు రోజులుగా పస్తులు ఉంటు న్నాం. గతంలో కొందరు మా వద్ద డబ్బులు తీసుకుని స్థలా లు చూపారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారు. ఇళ్ల తొలగింపుపై ప్రభుత్వం విచారణ చేయించి మమ్మల్ని ఆదుకోవాలి.

 దార్ల వేలంగి 




Updated Date - 2022-06-30T08:04:17+05:30 IST