బూరుగడ్డ దేవాలయానికి 14 మంగళసూత్రాల సమర్పణ

ABN , First Publish Date - 2022-01-14T05:43:36+05:30 IST

మండలంలోని బూరుగడ్డ గ్రామంలోని ఆదివరాహా లక్ష్మీనృసింహ-వేణుగోపాలస్వామి దేవాలయానికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గరిణె వేణుగోపాల్‌,అపర్ణ కుటుంబ సభ్యులు 14 మంగళసూత్రాలను గురువారం సమర్పించారు.

బూరుగడ్డ దేవాలయానికి 14 మంగళసూత్రాల సమర్పణ
మంగళసూత్రాలను సమర్పిస్తున్న భక్తులు

హుజూర్‌నగర్‌  రూరల్‌, జనవరి 13 : మండలంలోని బూరుగడ్డ గ్రామంలోని ఆదివరాహా లక్ష్మీనృసింహ-వేణుగోపాలస్వామి దేవాలయానికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గరిణె వేణుగోపాల్‌,అపర్ణ కుటుంబ సభ్యులు 14 మంగళసూత్రాలను గురువారం సమర్పించారు. ఆలయంలోని ఏడుగురు అమ్మవార్లకు రెండేసి చొప్పున మంగళసూత్రాలు విరాళంగా అందజేశారు. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని దాతలు తెలిపారు. కార్యక్రమంలో ఈవో లక్ష్మణ్‌రావు, నాగరాజు, కళావతి, శ్రీనివాసాచార్యులు, హరీ్‌షకుమాచార్యులు, రాగం లింగయ్య, రామస్వామి, పూర్ణ, కిరణ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-14T05:43:36+05:30 IST