రుణ విస్తరణ కార్యక్రమం రేపు

ABN , First Publish Date - 2022-06-07T06:40:34+05:30 IST

రుణ వితరణ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 8న రుణ విస్తరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ కెశ్రీరామకృష్ణ తెలిపారు. భువనగిరిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు భువనగిరి శివారులోని ఏకే ఫంక్షన్‌హాల్‌లో రుణ విస్తరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

రుణ విస్తరణ కార్యక్రమం రేపు
మాట్లాడుతున్న లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీరామకృష్ణ

యాదాద్రి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : రుణ వితరణ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 8న రుణ విస్తరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ కెశ్రీరామకృష్ణ తెలిపారు. భువనగిరిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు భువనగిరి శివారులోని ఏకే ఫంక్షన్‌హాల్‌లో రుణ విస్తరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.జిల్లాలోని 16 బ్యాంకులు పాల్గొంటాయని, విద్య,గృహ,వ్యక్తిగత తదితర రుణ మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంజేజీ వై, పీఎంఎ్‌సబీవై తదితర పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటుచేస్తామని, ఆయా బ్యాంకు ఖా తాదారులు నేరుగా సంబంధిత బ్యాంకు అధికారులకు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ పమేలా సత్పథి ప్రారంభిస్తారని అన్నారు. సమావేశంలో యూనియన్‌ బ్యాంకు చీప్‌ మేనేజర్‌ ఉత్తంకుమార్‌,సతీష్‌ పాల్గొన్నారు. 

Read more