అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-10-17T06:03:39+05:30 IST
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మోత్కూరు మునిసిపాలిటీలో జరిగింది.
మోత్కూరు, అక్టోబరు 16: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మోత్కూరు మునిసిపాలిటీలో జరిగింది. పోలీసులు, గ్రామస్థులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. మునిసిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన పంగ చంద్రమౌళి(53) తనకు ధర్మాపురం గ్రామానికి చెందిన ఎల్లంల రాములమ్మ ఫోన్ చేసి రమ్మంటుందని, ఫోన్ మాట్లాడుకుంటూనే శనివారం ఉదయం బైక్పై వెళ్లిపోయాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో భార్య అతని కోసం చుట్టుపక్కల వెతికింది. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం కూడా వెతుకుతుండగా బుజిలాపురం- కొండగడప గ్రామాల మధ్య తొడేళ్ల బండ వద్ద బునాదిగాని(ధర్మారం)కాల్వ ఒడ్డున బైక్ కనిపించింది. అక్కడకు వెళ్లి చూడగా కాల్వలో చంద్రమౌళి మృతదేహం కన్పించింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. చంద్రమౌళి చెవి, వీపుపై గాయాలు, ముక్కు, నోటిలోంచి రక్తం కారినట్లు ఉంది. అతనిని హత్య చేసి ఉంటారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసేవాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చంద్రమౌళి భార్య సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జానకిరాంరెడ్డి తెలిపారు.