సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకోవాలి

ABN , First Publish Date - 2022-12-16T01:22:21+05:30 IST

ప్రతీ ఒక్కరు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకోవాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. గురువారంరాత్రి జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌తో కలిసి క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులకు క్రిస్మస్‌ కానుకలను పంపిణీ చేశారు.

సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకోవాలి
క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), కల్చరల్‌, డిసెంబరు 15: ప్రతీ ఒక్కరు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకోవాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. గురువారంరాత్రి జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌తో కలిసి క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులకు క్రిస్మస్‌ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని కులమతాల పండుగలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంచేశారు. మహాత్మాగాంధీ మార్గాలను సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలనేది బీఆర్‌ఎస్‌ లక్ష్యమన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాక ముందు పాలించిన ప్రభుత్వాలు ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌చైర్మన్‌ పుట్టా కిశోర్‌కుమార్‌, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, నాయకులు తాహేర్‌పాష, పూర్ణ శశికాంత్‌, స్వరూపరాణి, జ్యోతి కర్ణాకర్‌, జ్యోతి శ్రీవిద్య, మహేశ్వరి, పాస్టర్‌ ఉదయ్‌రాజ్‌ పాడెల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:22:23+05:30 IST