నేరస్థులకు శిక్షలు పడేలా దర్యాప్తు ఉండాలి: డీజీపీ
ABN , First Publish Date - 2022-12-07T23:32:42+05:30 IST
నేరస్థులకు కోర్టుల్లో శిక్షలు పడేలా దర్యాప్తు ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు.
సూర్యాపేటక్రైం, డిసెంబరు 7: నేరస్థులకు కోర్టుల్లో శిక్షలు పడేలా దర్యాప్తు ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జిల్లా ఎస్పీతో పాటు జిల్లాలోని పోలీస్ అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో మాట్లాడారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కోర్టు డ్యూటీ అధికారులు, ఇతర సిబ్బంది కోర్టు డ్యూటీ మానిటరింగ్ సిస్టం ఫంక్షనల్ వర్టికల్‌ను పక్కాగా అమలు చేయడంతో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న నేరస్థులకు శిక్షలు పడుతున్నాయన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు కొలిక్కి వస్తున్నాయన్నారు. అనంతరం ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో కోర్టు డ్యూటీ విధులను పక్కాగా నిర్వహిస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది శిక్షల శాతం పెరిగిందన్నారు. ఎప్పటికప్పుడు కోర్టు డ్యూటీ విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. అదేవిధంగా కోర్టు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరుస్తున్నామని వివరించారు. కాన్ఫరెన్సలో డీఎస్పీ పరిక నాగభూషణం, ఎస్‌బీఐ తుల శ్రీనివాస్, సీఐలు సోంనారాయణసింగ్, నర్సింహ, రాజేష్, నాగార్జున పాల్గొన్నారు.