గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి
ABN , First Publish Date - 2022-12-15T00:20:19+05:30 IST
గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు, యంరాల్డ్ స్వీట్‌హౌస్ అధినేత విజయరామారావు అన్నారు.
చండూరు రూరల్, డిసెంబరు 14: గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు, యంరాల్డ్ స్వీట్‌హౌస్ అధినేత విజయరామారావు అన్నారు. మండలంలోని బంగారిగడ్డలో యుగ తులసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యుగ తులసీ గోశాలను బుధవారం ప్రారంభించారు. భవిష్యత్ తరాలకు గోవు అవసరమన్నారు. ప్రస్తుతం రైతులు మూసపద్ధతిలో వ్యవసాయం చేస్తూ భూమిపై అనేక విషపూరిత రసాయనాలు చల్లి భూమాతను క్షోభపెడుతున్నారన్నారు. ఒక్క గోవుతో 30ఎకరాల్లో రసాయనిక ఎరు వులు లేకుండా కేవలం జీవామృతంతో ఐదు దుంతర్లపంట వ్యవసా యం చేసుకోవచ్చాన్నారు. కార్యక్రమంలో యుగ తులసీ పార్టీ వ్యవ స్థాపక అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్, సంగమేశ్వరచారి, మహబూబ్, పమ్మి, శేఖర్, విజయ్, నాగార్జున, శంకర్ పాల్గొన్నారు.