పట్టణ సుందరీకరణకు సహకరించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-03-05T06:31:25+05:30 IST

నల్లగొండ పట్టణ సుందరీకరణకు సహకరించాలని కలెక్టర్‌ ప్రశాంత జీవనపాటిల్‌ సూచించారు.

పట్టణ సుందరీకరణకు సహకరించాలి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పాటిల్‌

 రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం 

 రామగిరి, మార్చి 4: నల్లగొండ పట్టణ సుందరీకరణకు సహకరించాలని కలెక్టర్‌ ప్రశాంత జీవనపాటిల్‌ సూచించారు. పట్టణంలో జరుగుతున్న సుందరీకరణ పనుల్లో భాగంగా రోడ్డు వెడల్పు పనులను మునిసిపల్‌ అధికారులు శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారితో కలిసి పరిశీలించి మాట్లాడా రు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. మర్రిగూడ బైపాస్‌ నుంచి ఎల్‌వీకుమార్‌ పెట్రోల్‌ బంక్‌ వరకు 80 గృహ నిర్మాణాలను ఎక్స్‌కవేటర్లతో తొలిగింపజేశారు. మర్రిగూడ బైపాస్‌ జంక్షన నుంచి క్లాక్‌టవర్‌ సెంటర్‌ వరకు 100 ఫీట్ల రోడ్డుగా విస్తరించనున్నట్లు తె లిపారు. ఈ విస్తరణలో 144 గృహ నిర్మాణాలు తొలగించాలని గు ర్తించినట్లు తెలిపారు. శనివారం ఎల్‌వీ కుమార్‌ బంకు నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ము నిసిపల్‌ ఏసీపీ నా గిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 

నల్లగొండ స్పో ర్ట్స్‌: ఇండోర్‌ స్టేడియంను అంతర్జాతీ య స్థాయిలో అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించామని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. జి ల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంను కలెక్టర్‌ జీవనపాటిల్‌, ప్రజాప్రతినిధులు, ఇతర జిల్లా ఉన్నతాఽధికారులతో కలిసి పరిశీలించారు. 


Updated Date - 2022-03-05T06:31:25+05:30 IST