అంధుల పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా

ABN , First Publish Date - 2022-09-26T06:17:08+05:30 IST

నల్లగొండలోని అంధుల పాఠశా ల అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు.

అంధుల పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా
దీనదయాల్‌కు నివాళులర్పిస్తున్న లక్ష్మణ్‌, చొక్కారావు

 రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌

 నల్లగొండ, సెప్టెంబరు 25: నల్లగొండలోని అంధుల పాఠశా ల అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని సూర్‌దాస్‌ భవనంలో నిర్మించిన పండిట్‌ దీనదయాల్‌ ఉపాధ్యా య జయంతికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ని వాళులర్పించి మాట్లాడారు. దివ్యాంగులకు నాణ్యమైన విద్యను అం దించి జీవితంలో స్థిరపడే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. 2016లో కేంద్రప్రభుత్వం దివ్యాంగుల కోసం తీసుకొచ్చిన చ ట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. డ్వాబ్‌ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు మా ట్లాడుతూ అంధుల పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం 2021-22 గ్రాంట్‌ నిధులు ఇంత వరకు మంజూరు చేయలేదని అన్నారు. నిధుల మంజూరుకు ఎంపీ సహకరించాలని కోరా రు. దాతల సహకారంతోనే ఇప్పటి వరకు పాఠశాలను నడుపుతున్నామని, తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అప్పులు చేసి పాఠశాలను నడుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే పాఠశాలను మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అనంతరం అంధుల పాఠశాలలో చదివి, వివిధ స్థాయిల్లో ఉద్యోగా లు చేస్తున్న వారిని ఘనంగా సన్మానించారు.  కా ర్యక్రమంలో కర్నా టి విజయ్‌కుమార్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివా్‌సగౌడ్‌, విశ్రాంత డాక్టర్‌ రాజేంద్రకుమార్‌, నాయకులు కల్లోజు శ్రీనివాస్‌, సతీ్‌షరావు, శ్రీధర్‌రెడ్డి, రాంరెడ్డి, పాపారావు, సతీష్‌, జితేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more