బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నేతల పరామర్శ
ABN , First Publish Date - 2022-08-09T07:03:07+05:30 IST
:పెన్‌పహాడ్, హుజూర్నగర్ మండ లాల్లో బాధిత కుటుంబాలను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (ఆర్డీఆర్) కోదాడా మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం పరామర్శించారు.

పెన్‌పహాడ్, హుజూర్నగర్ ఆగస్టు 8:పెన్‌పహాడ్, హుజూర్నగర్ మండ లాల్లో బాధిత కుటుంబాలను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (ఆర్డీఆర్) కోదాడా మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం పరామర్శించారు. పెన్‌పహాడ్ మండలం ధర్మాపురం గ్రామంలో ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కోక రమేష్ కుటుంబ సభ్యులను ఆర్డీఆర్ పరామ ర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇదే గ్రామంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మేడేపెల్లి శంకర్‌ను ఆయన పరామర్శించారు. హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్య క్షుడు పులిచిం తల జగన్మోహన్రెడ్డి సంతాపసభలో మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల విద్యుదా ఘాతంతో మృతిచెందిన మీసాల నాగరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. ధర్మాపురంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు, జిల్లా నాయకుడు చకిలం రాజేశ్వర్‌రావు, హుజూర్ నగర్లో తన్నీరు మల్లికార్జున్‌రావు, గల్లా వెంకటేశ్వర్లు, కస్తాల శ్రావణ్, పశ్యా వెంకట్‌రెడ్డి, వీరబాబు, పులిచింతల అరుణ పాల్గొన్నారు.