క్రీడా ప్రాంగణాలకు జూన్ 2న శంకుస్థాపన
ABN , First Publish Date - 2022-05-26T06:36:41+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు జూన్ 2వ తేదీన ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలకు శంకుస్థాపన చేస్తామని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు
మునగాల రూరల్, క్రీడా ప్రాంగణాలకు జూన్ 2న శంకుస్థాపన
కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
మునగాల రూరల్, మే 25: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు జూన్ 2వ తేదీన ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలకు శంకుస్థాపన చేస్తామని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని ఆకుపాముల గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాల సేకరణ చేపట్టామన్నారు. వీటికి జూన్ 2న శంకుస్థాపన చేస్తామన్నారు. మండలంలోని నారాయణగూడెం, రేపాల, మునగాల గ్రామాల్లో సైతం త్వరలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో భూపాల్‌రెడ్డి, సర్పంచ్ కేశగాని వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.మే 25: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు జూన్ 2వ తేదీన ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలకు శంకుస్థాపన చేస్తామని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని ఆకుపాముల గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాల సేకరణ చేపట్టామన్నారు. వీటికి జూన్ 2న శంకుస్థాపన చేస్తామన్నారు. మండలంలోని నారాయణగూడెం, రేపాల, మునగాల గ్రామాల్లో సైతం త్వరలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో భూపాల్‌రెడ్డి, సర్పంచ్ కేశగాని వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.