‘సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి’
ABN , First Publish Date - 2022-06-29T06:41:05+05:30 IST
మహబూబాబాద్(మానుకోట)లో జూలై 1, 2 తేదీల్లో నిర్వహించే బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తేజావత్ బెల్లయ్యనాయక్ కోరారు.
పెన్‌పహాడ్, జూన్ 28: మహబూబాబాద్(మానుకోట)లో జూలై 1, 2 తేదీల్లో నిర్వహించే బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తేజావత్ బెల్లయ్యనాయక్ కోరారు. మంగళవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలో నిర్వహించిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీ హక్కుల పోరాట సమితి 25వ వార్సికోత్సవం సందర్భంగా జూలై ఒకటో తేదీన బంజారా జాతీయ సమ్మేళనం, రెండో తేదీన ప్రతినిధుల సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు .కైలాష్‌నాయక్, అశోక్ జ్యోతి పాల్గొన్నారు