మహిళలకు ముగిసిన దేహదారుఽడ్య పరీక్షలు

ABN , First Publish Date - 2022-12-15T00:13:51+05:30 IST

మహిళలకు ముగిసిన దేహదారుఽడ్య పరీక్షలు

మహిళలకు ముగిసిన దేహదారుఽడ్య పరీక్షలు
పరుగు పోటీల్లో పాల్గొన్న మహిళలు

అర్హత సాధించిన 2,889 మంది అభ్యర్థులు

నల్లగొండ టౌన్‌, డిసెంబరు 14: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్‌ స్టేడియంలో బుధవారం కూడా కొనసాగాయి. గత నాలుగు రోజులుగా మహిళా అభ్యర్థులకు నిర్వహిస్తున్న పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు మొత్తం 1,400 మంది అభ్యర్థులకు 1,234 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 831 మంది అర్హత సాఽధించారు. ఈవెంట్స్‌ ప్రత్యేక అధికారి శబరీష్‌ పరీక్షలను పర్యవేక్షించి అభ్యర్థులకు సూచనలు చేశారు.

4,265 మంది మహిళా అభ్యర్థులు హాజరు

ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన పరీక్షలకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి 26,433 మంది హాజరవుతుండగా వీరిలో 4,830 మంది మహిళా అభ్యర్థులున్నారు. వీరికి ఈ నెల 10, 12, 13, 14వ తేదీల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ పరీక్షలకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి 4,265 మంది మహిళా అభ్యర్థులు హాజరవ్వగా వీరిలో 2,889 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షలు జనవరి 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

Updated Date - 2022-12-15T00:14:06+05:30 IST