ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-18T05:26:11+05:30 IST

ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మునుగోడు తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మలు ఆకస్మిక తనిఖీ చేశా రు.

ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి
మునుగోడు తహసీల్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

మునుగోడు, ఆగస్టు 17: ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మునుగోడు తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మలు ఆకస్మిక తనిఖీ చేశా రు.వివిధ రికార్డులను పరిశీలించి, ప్ర జాసంక్షేమ పథకాల అమలు తీరును అడిగితెలుసుకున్నారు. ధరణి సేవలు రైతులకు ఏ రకంగా అందుతున్నాయో ఆరా తీశారు. వారివెంట స్థానిక తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాసులు, నాయిబ్‌ తహసీల్దార్‌ గాదె నరేష్‌ ఉన్నారు.


Read more