ఆస్తి పంచాలని దాడి చేశారని ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-05-18T06:24:08+05:30 IST

ఆస్తిని పంచాలని తమ పెద్దకోడలు తమపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు దాడి చేశారని మండలంలోని కోప్పోలు గ్రామానికి చెందిన తాడూరి వజ్రమ్మ, రామాచారి దంపతులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపారు.

ఆస్తి పంచాలని దాడి చేశారని ఫిర్యాదు

గుర్రంపోడు, మే 17: ఆస్తిని పంచాలని తమ పెద్దకోడలు తమపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు దాడి చేశారని మండలంలోని కోప్పోలు గ్రామానికి చెందిన తాడూరి వజ్రమ్మ, రామాచారి దంపతులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా వజ్రమ్మ మాట్లాడుతూ తమ పెద్దకుమారు డు శంకర్‌ గతేడాది కరోనాతో చనిపోయాడు. అప్పటినుంచి కోడలు నాగలక్ష్మి, ఆ మె సోదరులు ఆస్తి పంచాలని తమను వేధిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవా రం తమ ఇంటిపై దాడి చేసి తనను, తన భర్తను తిడుతూ ఇంట్లో వస్తువులు చిందరవందర చేశారని ఆరోపించారు. ఆస్తిని పంచకపోతే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Read more