మల్లన్న సాగర్‌ తరహాలోనే పరిహారం అందించాలి

ABN , First Publish Date - 2022-09-10T06:14:48+05:30 IST

డిండి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు మల్లన్నసాగర్‌ తరహాలోనే ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య డిమాండ్‌ చేశారు.

మల్లన్న సాగర్‌ తరహాలోనే పరిహారం అందించాలి

మర్రిగూడ, సెప్టెంబరు 9: డిండి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు మల్లన్నసాగర్‌ తరహాలోనే ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య డిమాండ్‌ చేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో వ్యవసాయ భూములు కోల్పోయిన శివన్నగూడ, రాంరెడ్డిపల్లి, ఖుదాభక్షిపల్లి, అజిలాపురం భూ నిర్వాసితులు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పరిహారం అందించాలని మర్రిగూడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారం 9వ రోజుకు చేరింది. 2013 భూసేకరణ చట్ట ప్రకారం చర్లగూడెం రిజ ర్వాయర్‌ కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ అందించి నిరుద్యోగ యువతి యవకులకు జీవనభృతి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దోమ వెంకటయ్య, పుప్పాల యాదయ్య, భిక్షంరెడ్డి, బూడిద సురేష్‌, ఆకుల రఘుమయఙ్యు, పగడాల లింగయ్య పాల్గొన్నారు. 


Read more