పోరాట యోధుడు సేవాలాల్‌

ABN , First Publish Date - 2022-03-05T06:34:33+05:30 IST

నవసమాజ స్థాపకుడు, పోరాటయోధుడు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అని నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

పోరాట యోధుడు సేవాలాల్‌
మట్టపల్లిలో జరిగిన సంత్‌ సేవాలాల్‌ జయంతి సభలో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌

 ఆయన చూపిన మార్గంలో నడవాలి

 ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మఠంపల్లి, మార్చి 4 : నవసమాజ స్థాపకుడు, పోరాటయోధుడు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అని నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని  మట్టపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సేవాలాల్‌ జయంతిలో ఆయన పాల్గొన్నారు. సేవాలాల్‌ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళుల ర్పించి, రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగ్‌బండార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ అడవుల్లో జీవిస్తూ అభ్యుదయ, సాంస్కృతిక పోరాటాలను సేవాలాల్‌ నిర్వహించారన్నారు. ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చాలని, బుక్‌లెట్‌ రూపంలో తీసుకురావాలన్నారు. గిరిజనులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఎమ్మెల్యే సైదిరెడ్డి గిరిజనుల ఆస్తులనే కాజేశారని ఎద్దేవా చేశారు. మట్టపల్లి క్షేత్రంలో గిరిజన సత్రానికి కేటాయించిన స్థలంలో రూ.5లక్షలతో ఆశ్రమం కోసం గదులు నిర్మిస్తానని, ఎంపీ నిధులు మరో రూ.5లక్షలు సత్రానికి కేటాయిస్తానని ప్రకటించారు.

ఎటూ వెళ్లినా ఎమ్మెల్యే భూ ఆక్రమణలే

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఎటూచూసినా, వెళ్లినా ఎమ్మెల్యే సైదిరెడ్డి భూఆక్రమణలే కనిపిస్తున్నాయని ఉత్తమ్‌ ఆరోపించారు. పెదవీడు రెవెన్యూ పరిధిలోని 540 సర్వే నంబర్‌లో ఎన్‌సీఎల్‌కు సంబంధించిన 107 ఎకరాలు భూ మిని ఎమ్మెల్యే కబ్జా చేశారని, స్వయంగా పరిశ్రమ ఎండీ కలిదండి రవి చెప్పారన్నారు. ఇదే సర్వే నంబరులో ఎంజీ పవర్‌ప్లాంటుకు సంబంధించిన 120 ఎకరాలు, పెదవీడు సమీపంలో మరో 46 ఎకరాలు దౌర్జన్యంగా ఆక్ర మిం చార ని ఆరోపించారు. అంజనీ, డక్కెన్‌ సిమెంట్‌ పరిశ్రమల సమీపంలో ఎమ్మెల్యే భూఆక్రమణలకు పాల్పడ్డారని అన్నా రు. ఎమ్మెల్యేతో ఏ పని కావాలన్నా కమీషన్లు లేనిది, ఇవ్వనిదే ముందుకు వెళ్లవన్నారు. జిల్లాలో పోలీసుల దౌర్జన్యా లు ఎక్కువయ్యాయని; జిల్లా వ్యాప్తంగా అక్రమ కేసులు, భూకబ్జాల విషయాలను సేకరించి బుక్‌లైట్‌ తయారు చేయిస్తామన్నారు. బుక్‌లెట్‌ను చీఫ్‌జస్టి్‌సకు, పార్లమెంటుతో పాటు దేశంలోని ప్రముఖులకు అందజేస్తామన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భూక్య మంజూనాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాల్లో నాయకులు సాముల శివారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, అన్నపురెడ్డి అప్పిరెడ్డి, ఎంపీపీ భూక్య గోపాల్‌నాయక్‌, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ధీరావత్‌ నవీన్‌నాయక్‌, నాయకులు కొట్టే సైదేశ్వర్‌రావు, గోవిందరెడ్డి, మోతీలాల్‌నాయక్‌, మాలోతు బీముడునాయ క్‌, వంటిపులి శ్రీనివాస్‌, రామిశెట్టి అప్పారావు, సీతారామ య్య, ఆదూరి కిషోర్‌రెడ్డి, కరీం, పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మ న్లు రామచంద్రయ్య, బాబునాయక్‌, ఎంఎంయాదవ్‌, సాముల వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:34:33+05:30 IST