సీఎంఆర్‌ను వేగంగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-08-04T05:59:08+05:30 IST

గడువు సమీపిస్తున్నందున సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)ను వేగవంతంచేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం గూడూరులోని శివరామకృష్ణ రైస్‌మిల్‌లోని సీఎంఆర్‌ మిల్లింగ్‌ను పరిశీలించారు

సీఎంఆర్‌ను వేగంగా పూర్తి చేయాలి
సీఎంఆర్‌ మిల్లింగ్‌ను పరిశీలిస్తున్న డీఎ్‌సవో వెంకటేశ్వర్లు

డీఎ్‌సవో వెంకటేశ్వర్లు

మిర్యాలగూడ, ఆగస్టు 3: గడువు సమీపిస్తున్నందున సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)ను వేగవంతంచేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం గూడూరులోని శివరామకృష్ణ రైస్‌మిల్‌లోని సీఎంఆర్‌ మిల్లింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 31వ తేదీ వరకు ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేయాల్సి ఉన్నందున మిల్లింగ్‌ను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్‌ మిల్లింగ్‌కు సంబంధించి మిర్యాలగూడలో 46 రైసుమిల్లుల్లో 506 ఏసీకేలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈనెల 31వ తేదీ వరకు వాటిని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి రమేష్‌,  వెంకటరమణ చౌదరి, శ్రీనివాస్‌, వెంకటరత్నం, రామకృష్ణారెడ్డి, సురేందర్‌ సింగ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T05:59:08+05:30 IST