సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-09-13T05:55:49+05:30 IST

సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలి
మాసాయిపేట గ్రామంలో గణేష్‌ శోభాయాత్రలో పాల్గొన్న మహేందర్‌రెడ్డిడీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట రూరల్‌/రాజాపేట సెప్టెంబరు 12: సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మాసాయిపేట గ్రామంలో గణపతి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదుగడానికి ఆశీర్వదించాలని గణపతి దేవుడిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖ శాంతులతో, సకల సంపద కలిగి ఉండే విధంగా దీవించాలని స్వామిని వేడకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజాపేట మండల కేంద్రంలోని హైస్కూల్‌ చౌరస్తాలోని వినాయకుని వద్ద  డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారం భించారు. అనంతరం లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు బాలమణి యాదగిరిగౌడ్‌, పల్లె సంతోష్‌, సందెల భాస్కర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Read more