సీఎం కేసీఆర్‌ గిరిజనుల పాలిట ఆపద్బాంధవుడు

ABN , First Publish Date - 2022-09-19T05:45:43+05:30 IST

సీఎం కేసీఆర్‌ గిరిజనుల పాలిట ఆపద్బాంధవుడని యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్‌తండా సర్పంచ్‌ దీరావత్‌ బుజ్జిశంకర్‌నాయక్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌ గిరిజనుల పాలిట ఆపద్బాంధవుడు
యాదగిరిగుట్టలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

యాదగిరిగుట్ట రూరల్‌/ చౌటుప్పల్‌ టౌన్‌/ రాజాపేట/ తుర్కపల్లి, సెప్టెంబరు 18: సీఎం కేసీఆర్‌ గిరిజనుల పాలిట ఆపద్బాంధవుడని యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్‌తండా సర్పంచ్‌ దీరావత్‌ బుజ్జిశంకర్‌నాయక్‌ అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ కేటాయించినందుకు గుట్టలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఆది వారం క్షీరాభిషేకం చేశారు. రిజర్వేషన్లతో అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్నారు. రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో సైతం తమకు ప్రధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ మంక్యనాయక్‌, సింగిల్‌విండో డైరెక్టర్‌ రమేష్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు మంగ్యా, నాయకులు బుచ్చినాయక్‌, గోపినాయక్‌, లక్ష్మీ, భారతీ, యాదమ్మ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఏనగంటి తండాకు చెందిన గిరిజనులు చౌటుప్పల్‌లో గిరిజనులు క్షీరాభిషేకం చేశారు. కార్య క్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌ గౌడ్‌, మం డల ప్రధాన కార్యదర్శులు సుర్కంటి శ్రీధర్‌రెడ్డి, రైతుబందు జిల్లా సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్‌, ఎ. కిష్టయ్య, తండా సర్పంచ్‌ కరంటోత్‌ నర్సింహ్మనాయక్‌, మాజీ సర్పంచ్‌ మంతీనాయక్‌, పంత్‌నాయక్‌, లాలునాయక్‌, బాసునాయక్‌ పాల్గొన్నారు. రాజాపేటలో గిరిజనులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాములు నాయక్‌, లక్ష్మణ్‌, నాయక్‌, సందెల భాస్కర్‌గౌడ్‌, వీరేశం, సట్లు తిరుమలేష్‌, జశ్వంత్‌, నర్సింహులు పాల్గొన్నారు. తుర్కపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీరవీందర్‌నాయక్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ధానావతు బీకునాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పిన్నెపురెడ్డి నరేందర్‌రెడ్డి, కొమిరిశెట్టి నర్సింహులు, గట్టు తేజస్వీనిఖిల్‌, గుగులోతు బద్ధునాయక్‌  తదితరులు పాల్గొన్నారు. 

Read more