రాజీవ్‌ స్వగృహ ప్లాట్లకు ముగిసిన వేలం

ABN , First Publish Date - 2022-03-18T06:40:52+05:30 IST

జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రాజీవ్‌ స్వగృహ(శ్రీవ ల్లీ టౌన్‌షిప్‌) ప్లాట్ల వేలం గురువారంతో ముగిసింది.

రాజీవ్‌ స్వగృహ ప్లాట్లకు ముగిసిన వేలం

 నాలుగు రోజుల్లో 165 ప్లాట్ల విక్రయం 

నల్లగొండ టౌన్‌, మార్చి 17: జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రాజీవ్‌ స్వగృహ(శ్రీవ ల్లీ టౌన్‌షిప్‌) ప్లాట్ల వేలం గురువారంతో ముగిసింది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు టౌన్‌షి్‌పలోని 240 ప్లాట్లకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని ఉదియాదిత్య భవన్‌లో వేలం ప్రక్రియను నిర్వహించగా, 165 ప్లాట్లను బిడ్డర్లు సొంతం చేసుకున్నారు. అందులో 33 మల్టీపర్పస్‌ ప్లాట్లు కాగా, 207 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. ప్రభుత్వ ధర గజానికి రూ.7వేలుగా నిర్ణయించగా, తొలిరోజే మొత్తం 33మల్టీపర్పస్‌ ప్లాట్లను గజానికి రూ.13,500లకు దక్కించుకున్నారు. నాలుగు రోజుల్లో 132మల్టీపర్పస్‌ ప్లాట్లు, మొత్తం గా 165ప్లాట్లను బిడ్డర్లు కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.31.79కోట్ల ఆదాయం సమకూరనుంది. వేలంలో చివరి రోజైన గురువారం అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ వే లం పాటను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలానికి బిడ్డర్ల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. మొత్తంగా 240 ప్లాట్లకు 165ప్లాట్లను బిడ్డర్లు ప్రత్యక్ష వేలంలో సొంతం చేసుకున్నారని తెలిపారు. కొనుగోలుదారులు ప్లాట్ల మొత్తం విలువ ఒక నెలలో చెల్లిస్తే రెండు శాతం మేర రాయితీ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ ఈఈ రమేష్‌, సర్వేలాండ్‌ రికార్డు ఏఈ శ్రీనివాస్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ నాగేశ్వర్‌రావు, సీపీవో బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-18T06:40:52+05:30 IST