దసరా వేడుకల్లో ఘర్షణ

ABN , First Publish Date - 2022-10-07T05:38:29+05:30 IST

దసరా వేడుకల్లో జరిగిన ఘర్షణలో ము గ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

దసరా వేడుకల్లో ఘర్షణ

తుంగతుర్తిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల బాహాబాహీ

పెద్దవూర, మోత్కూరులో ఒకరిపై ఒకరు దాడి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘటనలు

పెద్దవూర, అక్టోబరు 6: దసరా వేడుకల్లో జరిగిన ఘర్షణలో ము గ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారం గ్రామానికి చెందిన ఏరుకొండ సత్యనారాయ ణ, జయమ్మ దంపతులు దసరా సందర్భంగా తన అత్తమామలైన బొ డ్డుపల్లి భిక్షం ఇంటికి వచ్చారు. అదే గ్రామంలో చెన్ను సైదిరెడ్డి ఇంటి వ ద్ద మహిళలు బతుకమ్మ ఆడుతుండగా ఏడుకొండ సత్యనారాయణ, జయమ్మ, శంకరమ్మ చూడటానికి వెళ్లారు. అదే గ్రామంలో పెద్దగూడెం గ్రామానికి చెందిన శ్యాంసుందర్‌రెడ్డి దంపతులతో తన అత్తగారిల్లు బట్టుగూడెంకు వచ్చారు. బతుకమ్మ చూస్తున్న సత్యనారాయణకు శ్యాం సుందర్‌రెడ్డి మధ్య వివాదం ఘర్షణకు దారి తీసింది. ఇరువురిని గ్రామస్థులు  విడదీసి ఇళ్లకు వెళ్లమని చెప్పారు.తిరిగి వెళ్తున్న క్రమంలో శ్యాంసుందర్‌రెడ్డి కారుతో వేగంగా వచ్చి వారిని ఢీకొట్టాడు. దీంతో సత్యనారాయణ కుమారు డు మనోజ్‌కు రెండు కాళ్లు, మరదలు శంకరమ్మకు ఎడమకాలు విరిగింది. సత్యనారాయణ అత్త బొడ్డుపల్లి నాగమ్మ తలకు బలమైన గాయాలుకాగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. క్షతగాత్రులను హైదరాబాద్‌ మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శ్యాం సుందర్‌రెడ్డిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పరమేష్‌ తెలిపారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల ఘర్షణ

తుంగతుర్తి, అక్టోబరు 6: దసరా పండుగ రోజు మండల కేంద్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య బుధవారం ఘర్షణ ఘర్షణ జరిగింది. ఇరుపార్టీల కార్యకర్తలు, హెడ్‌కానిస్టేబుల్‌, హోంగార్డుకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ డానియల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మి పూజ చేసే సమయంలో ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని త్వరలో చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. దసరా పండుగ సందర్బంగా ఘర్షణ జరగడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రవికుమార్‌ ఆధ్వర్యంలో సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, 15మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. 

పలువురిపై కేసు నమోదు

మోత్కూరు, అక్టోబరు 6: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో దసరా రోజు రాత్రి కొందరు యువకులు రెండు వర్గాలు ఏర్పడి ఘర్షణ పడి కొట్టుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఎడ్ల ఉపేందర్‌, బోయిన వంశీ, పురుగుల బాలు, పంగ మత్స్యగిరి, బుంగపట్ల యాకు, పంగ యాకు,  మల్లెబోయిన మహేష్‌, ఎడ్ల రఘు, ఎడ్ల ఉపేందర్‌, ఎడ్ల బాలు, బందారపు ప్రవీణ్‌, అన్నెపు గోపి, రావుల మధు, ఎడ్ల శేఖర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.జానకిరాంరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-10-07T05:38:29+05:30 IST