శివన్నగూడ రిజర్వాయర్‌ వద్ద సినిమా సందడి

ABN , First Publish Date - 2022-03-15T06:09:12+05:30 IST

మర్రిగూడ మండ లం శివన్నగూడ గ్రామపరిధిలోని చర్లగూడెం రిజర్వాయర్‌ కట్టపై సోమవా రం సినిమా షూటింగ్‌ చే శారు.

శివన్నగూడ రిజర్వాయర్‌ వద్ద సినిమా సందడి
సినీహీరో సందీప్‌కిషనతో డైరెక్టర్‌ రంజిత

మర్రిగూడ, మార్చి 14: మర్రిగూడ మండ లం శివన్నగూడ గ్రామపరిధిలోని చర్లగూడెం రిజర్వాయర్‌ కట్టపై సోమవా రం సినిమా షూటింగ్‌ చే శారు. కరన సి బ్యానర్‌ పై ప్రేమకథ సినిమా షూటింగ్‌ ఉదయం 6 నుంచి కొనసాగింది. హీ రో సందీప్‌ కిషనపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమా షూటింగ్‌ జరుగుతుందని తెలిసిన పలు గ్రామాల ప్రజలు చూడటానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్‌ రంజిత జయకోడి మాట్లాడుతూ రూ. 15 కోట్లతో ఒక ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. శివన్నగూడ రిజర్వాయర్‌ కట్టపై కొన్ని ఫైటింగ్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల వర కు షూటింగ్‌ ఇక్కడే జరుగుతుందని తెలిపారు. షూటింగ్‌ సందర్భంగా మర్రిగూడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హీరోగా సందీప్‌ కిరణ్‌, హీరోయిన దివ్యాన్సకౌసిక్‌, నిర్మాత భరత మోహనరెడ్డి, మేనేజర్‌ దేసిడి వెంకట్‌తో పాటు జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, శివన్నగూడ రిజర్వాయర్‌ జేఈ దేవేందర్‌రెడ్డి, సర్పంచ చిట్యాల సబిత, వీరయ్య, సత్యం, రాంబాబు పాల్గొన్నారు.



Updated Date - 2022-03-15T06:09:12+05:30 IST