చింతపల్లి ఎస్‌ఐ రామాంజనేయులు, రైటర్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-04-24T05:36:57+05:30 IST

నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్‌ఐ ఎం.రామాంజనేయులు, రైటర్‌ యాదగిరిలను ఎస్పీ రెమా రాజేశ్వరి సస్పెండ్‌ చేశారు.

చింతపల్లి ఎస్‌ఐ రామాంజనేయులు, రైటర్‌ సస్పెన్షన్‌

చింతపల్లి, ఏప్రిల్‌ 23 : నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్‌ఐ ఎం.రామాంజనేయులు, రైటర్‌ యాదగిరిలను ఎస్పీ రెమా రాజేశ్వరి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలానికి చెందిన ఒక వ్యక్తిపై పీడీయాక్ట్‌ కేసు పెట్టకుండ ఉండేందుకు రూ.2 లక్షల వరకు లంచం అడిగినట్లు రుజువుకావడం, మరికొన్ని ఆరోపణలు రావడంతో ఎస్‌ఐ రామాంజనేయులుతో పాటు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలపై రైటర్‌ యాదగిరిలను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయమై దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావును వివరణ కోరగా ఎస్‌ఐ, రైటర్లు సస్పెండ్‌ వాస్తవమని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 


Read more