చందుపట్ల వాసి సైదులుకు ఓయూ డాక్టరేట్
ABN , First Publish Date - 2022-11-05T00:59:14+05:30 IST
నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందని టంగుటూరి సైదులుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది.
నల్లగొండ / నకిరేకల్ నవంబరు 4: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందని టంగుటూరి సైదులుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ప్రొఫెసర్ దాశరధుల నర్సయ్య పర్యవేక్షణలో నల్లగొండ జిల్లా అభ్యుదయ కవిత్వం-పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్ ప్రకటించింది. ప్రస్తుతం సైదులు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పీజీ తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సైదులును ఓయూ తెలుగుశాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ కాశీం, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షుడు సాగి కమలాకర్‌శర్మ, తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు సూర్యధనుంజయ, రాణి, అసిస్టెంట్‌ప్రొఫెసర్ రఘు, విజయలక్ష్మి అభినందించారు. డాక్టరేట్ రావడంపై చందుపట్ల గ్రామ ప్రజలు, వివేకానంద యువజన మండలి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.