పోగొట్టుకున్న డబ్బును పట్టించిన సీసీ కెమెరా

ABN , First Publish Date - 2022-09-30T06:52:09+05:30 IST

ద్వి చక్ర వాహనంపై అజాగ్రత్తగా తీసుకెళ్తున్న డబ్బు సంచి రోడ్డు మార్గమధ్య లో పడిపోగా, సీసీ కెమెరాల పుటేజీలు ఆ డబ్బు సంచిని తీసుకెళ్లిన వ్యక్తులను గుర్తించి పోలీసుల కు పట్టించాయి.

పోగొట్టుకున్న డబ్బును పట్టించిన సీసీ కెమెరా
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు

 పోగొట్టుకున్న డబ్బును పట్టించిన సీసీ కెమెరా

దాచుకున్న వ్యక్తుల నుంచి రూ. 11లక్షలు రికవరీ

వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు

మిర్యాలగూడఅర్బన, సెప్టెంబరు 29: ద్వి చక్ర వాహనంపై అజాగ్రత్తగా తీసుకెళ్తున్న డబ్బు సంచి రోడ్డు మార్గమధ్య లో పడిపోగా, సీసీ కెమెరాల పుటేజీలు ఆ డబ్బు సంచిని తీసుకెళ్లిన వ్యక్తులను గుర్తించి పోలీసుల కు పట్టించాయి. ఈ నెల 27వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం స్థానిక పోలీ స్‌స్టేషనలో డీఎస్పీ వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడకు చెందిన బియ్యం వ్యాపారి మంచుకొండ జగదీష్‌ అనే వ్యక్తి లారీ సప్లయ్‌ ఆఫీస్‌ నుంచి తనకు రావాల్సిన 11లక్షల నగదును రెగ్జిన బ్యాగులో పెట్టుకున్నాడు. డబ్బు సంచిని బైక్‌ వెనుక సీటు వద్ద సైడ్‌ క్లిప్‌కు తగిలించుకొని ఇంటికి బయలుదేరాడు. ఎంపీడీవో కార్యాలయం రోడ్డు నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఖమ్మం రోడ్డుపై ఎస్‌బీఐ బ్యాంకు ఎదురుగా ఉన్న స్పీడ్‌ బ్రేకర్లను దాటుతున్న క్రమంలో డబ్బుసంచి రోడ్డుపై పడిపోయింది. ఇంటికి వెళ్లాక బ్యాగు కనిపించకపోవడంతో వచ్చిన రోడ్డుమార్గంలో వెతికినా ఫలితం లేకపోవడంతో వనటౌన సీఐ రాఘవేందర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐ తన క్రైంటీం ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌తో కలిసి రాజీవ్‌చౌక్‌ నుంచి ఖమ్మం రోడ్డుపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఎస్‌బీఐ బ్యాంకు ఎదురుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయిన పుటేజీల ఆధారంగా డబ్బు ఉన్న బ్యాగును మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఇంద్రపల్లి వెంకటేశ్వర్లు అతని బావమరిది నాగరాజు కలిసి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆటో నెంబర్‌ ఆధారంగా వెంకటేశ్వర్లు ఇంటి అడ్ర్‌సను తెలుసుకున్న పోలీసులు కోర్టు అనుమతితో ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా డబ్బుసంచిని ఇంట్లోని బీరువాలో దాచినట్లుగా తెలిపారు. బీరువా కిందిభాగంలో దాచిన రూ. 11లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని దొరికిన సొమ్మును దురుద్దేశంతో సొంత అవసరాలకు వాడుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి నదగును కోర్టుకు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. రోడ్డుపై పోగొట్టుకున్న నగదును 24 గంటల వ్యవధిలో రికవరీ చేసిన సీఐ రాఘవేందర్‌, క్రైం టీం ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, పీసీలు రామకృష్ణ, రవిలను డీఎస్పీ అభినందించారు. ఆటోడ్రైవర్లు అత్యాశకు పోకుండా ప్రయాణికులు మర్చిపోయిన సామగ్రిని సమీప పోలీస్‌స్టేషనలో అప్పగించాలని డీఎస్పీ సూచించారు. 

ఇళ్లకు తాళాలు వేసి దసరా పండుగ కోసం ఊళ్లకు వెళ్లేవారు తమ ఇంటి ఏరియా వివరాలను సమీప పోలీసులకు అందించాలని డీఎస్పీ కోరారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా జాగ్రత్తపడాలని సూచించారు. స్టేషన హౌజ్‌ ఆఫీసర్లకు ఇస్తే చోరీలను అరికట్టేందుకు ఆ ప్రాంతంలో పోలీస్‌ నిఘా పెంచుతామని డీఎస్పీ తెలిపారు. 


Read more