గ్యాస్‌ మార్పిడి చేసి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు

ABN , First Publish Date - 2022-03-05T06:24:05+05:30 IST

బీబీనగర్‌ మండల కేంద్రంలో గ్యాస్‌ మార్పిడి చేసి అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.

గ్యాస్‌ మార్పిడి చేసి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు




బీబీనగర్‌, మార్చి 4:
బీబీనగర్‌ మండల కేంద్రంలో గ్యాస్‌ మార్పిడి చేసి అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు. పట్టణానికి చెందిన రాంపల్లి జంగయ్య అనే వ్యక్తి పెద్ద వంటగ్యాస్‌ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ నింపి అధిక ధరలకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో శుక్రవారం పోలీసులు అతని ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేసి 13 చిన్న సిలిండర్లు 3 పెద్ద సిలిండర్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-03-05T06:24:05+05:30 IST