విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి

ABN , First Publish Date - 2022-08-18T05:17:41+05:30 IST

విరివిగా మొక్కలునాటి వాతావరణ సమతుల్యంలో భాగస్వాములుకావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు

విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ సత్పథి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ

 అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌

భువనగిరి రూరల్‌, ఆగస్టు 17: విరివిగా మొక్కలునాటి వాతావరణ సమతుల్యంలో భాగస్వాములుకావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం ఆయన హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ సంపదను 33శాతం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఇందుకుగా ను రాష్ట్రవ్యాప్తంగా 230కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించుకున్నామన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్‌ పమేలాసత్పథి మాట్లాడుతూ ఈ నెల 21న జిల్లాలో 2లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఈఎస్‌ నవీన్‌కుమార్‌, డీపీవో ఆర్‌.సునంద, అదనపు పీడీ టి.నాగిరెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మీ పాల్గొన్నారు.  

Read more