మోత్కూరులో గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-08-25T06:05:08+05:30 IST

యాదాద్రిభువన గిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో గంజాయిని పోలీ సులు పట్టుకున్నారు.

మోత్కూరులో గంజాయి పట్టివేత
గంజాయిని పరిశీలిస్తున్న ఎస్‌ఐ జానకిరాంరెడ్డి

మోత్కూరు, ఆగస్టు 24:  యాదాద్రిభువన గిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో గంజాయిని పోలీ సులు పట్టుకున్నారు. రామన్నపేట సీఐ మోతీరాం, మోత్కూరు ఎస్‌ఐ వి.జానకిరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మోత్కూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నంబర్‌ లేని  బైక్‌పై ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి బైక్‌ను వదిలి పారిపోవడానికి ప్రయత్నిం చారు. పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. బైక్‌ను పరిశీలించగా బైక్‌ సీట్‌ కవర్‌లో 520 గ్రాముల గంజాయి లభించింది. గంజాయితో పాటు బైక్‌, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు(ఎం) మండలం ఖప్రాయపల్లి గ్రామానికి చెందిన పల్లె భరత్‌ చెడు అలవాట్లకు లోనై అధికంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో గంజాయి తాగే అలవాటు ఉన్న అతడి బంధువు వై.నిరంజన్‌ను కలిశాడు. ఇద్దరు కలిసి నిరం జన్‌కు తెలిసిన బొంపెల్లి సతీష్‌ అనే వ్యక్తిని కలిసి అతడి ద్వారా హైదరా బాద్‌లోని ఉప్పల్‌కు చెందిన అవినాష్‌ అలియాస్‌ డ్యాని అనే వ్యక్తి నుంచి 520 గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు. పల్లె భరత్‌ గంజాయి తీసుకుని బస్సులో ప్రయాణించి ఖప్రాయపల్లి చేరుకున్నాడు. అక్కడ గంజాయి తాగే అలవాటు ఉన్న అతడి మైనర్‌ స్నేహితునితో కలిసి గంజాయి విక్రయించడానికి మోత్కూరు వస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.15వేలు ఉంటుందన్నారు. అవినాష్‌ అలియాస్‌ డ్యాని పరారీలో ఉండగా పల్లె భరత్‌, వై.నిరంజన్‌, బొంపెల్లి సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని సీఐ మోతీరాం తెలిపారు.


Read more