ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్ష
ABN , First Publish Date - 2022-10-17T06:14:45+05:30 IST
జిల్లా కేంద్రంలో టీఎ ్‌సపీఎ్‌ససీ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
ఆలస్యంగా వచ్చిన 15 మందిని అనుమతించని అధికారులు
నల్లగొండ, అక్టోబరు 16: జిల్లా కేంద్రంలో టీఎ ్‌సపీఎ్‌ససీ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.00గంటల వరకు పరీక్ష నిర్వహించా రు. జిల్లా కేంద్రంలో మె ుత్తం 52 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 16,084 మంది అభ్యర్థులకు 13,195 మంది (82.04 శాతం) హాజరయ్యారు. 2,889 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 15 మంది అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంకాగా,వారిని అధికారులు అనుమతించలేదు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ పరిశీలించారు.కాగా, ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నలు పెద్దగా ఇవ్వడంతో ఒక్కో ప్రశ్న చదివేందుకే సమయం అధికంగా పట్టిందని, దీంతో సమయం సరిపోలేదని అభ్యర్థులు తెలిపారు.
ప్రశ్నలు పెద్దగా ఉన్నాయి : పి.వెంకటేష్, నకిరేకల్
ప్రశ్నలు పెద్దగా ఉండడంతో పరీక్ష రాయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రశ్నను చదవడానికే సమయం సరిపోయింది. ఈ విధానం సరైంది కాదు. ఎన్నో ఆశలతో పరీక్ష రాయడానికి వస్తే పరీక్ష విధానం సరిగా లేదు. భవిష్యత్తులో ఇలాంటి విధానానికి రాకుండా టీఎ్‌సపీఎ్‌ససీ చర్యలు తీసుకోవాలి.
స్టేట్మెంట్ మాదిరిగా ప్రశ్నలు : పి.శ్రీనివాస్, శాలిగౌరారం
ప్రశ్నలు మొత్తం స్టేట్మెంట్ల మాదిరిగా ఉన్నాయి. ప్రశ్నలు ఈ విధంగా రూపొందిస్తే చదవడానికే సమయం సరిపోతుంది. టీ ఎ్‌సపీఎ్‌ససీ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇలాంటి పొరపాట్లు లేకుండా అనుభవజ్ఞులతో ప్రశ్నాపత్రాలను తయారుచేయించాలి.లేదంటే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.