విద్యుదాఘాతానికి ఎద్దు మృతి
ABN , First Publish Date - 2022-10-17T06:34:03+05:30 IST
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎ ద్దు మృతి చెందింది.
మర్రిగూడెం, అక్టోబరు 16: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎ ద్దు మృతి చెందింది. ఈ ప్రమాదం మండలంలోని కమ్మగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన మార్నేని సుమనకుమార్ అనే రైతుకు చెందిన ఎద్దు రైస్‌మిల్లు సమీపంలో మేత మేస్తూ ప క్కనే ఉన్న ట్రాన్సఫార్మర్ వద్ద వెళ్లింది. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గు రై అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు సుమనకుమార్ తెలిపారు. నెల రోజుల క్రితం ఇదే ట్రాన్సఫార్మర్ వద్ద అనిల్‌కుమార్ అనే రైతుకు చెందిన ఎద్దు కూడా మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.