నిర్మించారు.. వినియోగం మరిచారు

ABN , First Publish Date - 2022-11-30T01:59:53+05:30 IST

మండల కేంద్రంలో వ్యవసాయ సబ్‌ మార్కెట్‌ అలంకారప్రాయంగా మారింది. దీనిని పదేళ్ల క్రితం సుమారు రూ.1.50కోట్లతో నిర్మించారు. ఆ తర్వాత అదనంగా రూ.50లక్షల వ్య యంతో గోదాం నిర్మించారు. హుజూర్‌నగర్‌ వ్యవసా య మార్కెట్‌ పరిధిలో ఉన్న మఠంపల్లి మండల సబ్‌ మార్కెట్‌ ఇప్పటివరకు రైతులకు ఉపయోగపడ లేదు.

నిర్మించారు.. వినియోగం మరిచారు
సబ్‌ మార్కెట్‌ యార్డు గోదాం చుట్టూ పెరిగి కంప చెట్లు

అవస్థల్లో మఠంపల్లి మండల రైతులు

మఠంపల్లి, నవంబరు 29: మండల కేంద్రంలో వ్యవసాయ సబ్‌ మార్కెట్‌ అలంకారప్రాయంగా మారింది. దీనిని పదేళ్ల క్రితం సుమారు రూ.1.50కోట్లతో నిర్మించారు. ఆ తర్వాత అదనంగా రూ.50లక్షల వ్య యంతో గోదాం నిర్మించారు. హుజూర్‌నగర్‌ వ్యవసా య మార్కెట్‌ పరిధిలో ఉన్న మఠంపల్లి మండల సబ్‌ మార్కెట్‌ ఇప్పటివరకు రైతులకు ఉపయోగపడ లేదు. నిర్మించినప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. దీంతో సబ్‌ మార్కెట్‌ యార్డు అవరణలో పిచ్చి మొక్క లు దర్శనమిస్తున్నాయి. దీనిని వినియోగం లోకి తీసుకురానందున తమ పంట ఉత్పత్తులను విక్రయించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎంతో వ్యయప్రయాసలతో పండించిన ఉత్పత్తులను దళారులకు తక్కువ రేటుకు విక్రయిస్తూ మోసపోతున్నారు. దశాబ్దాల తరబడి ఇదే తంతు కొనసాగుతున్నా సబ్‌ మార్కెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి మార్కెటింగ్‌ శాఖ దృష్టిసారించడంలేదు.

పెరిగిన పచ్చి ధాన్యం విక్రయాలు

ఆయకట్టులో పచ్చిధాన్యం(అప్పుడుకోసిన ధాన్యం) విక్రయాలు భారీగా పెరిగాయి. కాస్త మబ్బులుగా వాతావరణ ప్రతికూలంగా ఉందంటే ధాన్యం ధరను మిల్లర ్లు అమాంతం తగ్గిస్తున్నారు. ఈ సీజన్‌లో వ్యాపారులు ఇప్పటికే రూ.200నుంచి రూ.300 వరకు ధరను తగ్గించారు. మండలంలో ఎక్కువశాతం సన్నకారు రైతులే సాగుచేస్తున్నారు.ఈ ధాన్యానికి రూ.180 0 నుంచి రూ.2వేలు వరకు ధరలు పలికే పరిస్థితి ఉన్నప్పటీకి మిల్లర్లు, దళారులు రైతులను దగా చేస్తుండటంతో సరైన ఫలితం లభించక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతులకు ప్రతీ ఏటా సా గు ఖర్చులు పెరుగుతున్నాయి. దున్నకం, ఎరువులు, కూలీల నుంచి వరికోత యంత్రం వరకు ధరలు పెరిగాయి. కానీ, రైతులకు రెండు మూడే ళ్ల క్రితం ఏ ధరలు లభిస్తున్నా యో ఇప్పుడూ అవే ధరలు లభిస్తున్నాయి. అదే వ్యవసాయ సబ్‌ మార్కెట్‌ ఉంటే తమ ఉత్పత్తులకు మంచి ధరలు పలుకుతాయని రైతులు చెబుతున్నారు.

సిండికేట్‌గా మారిన మిల్లు యాజమానులు

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహ కులు సన్న రకాలకు కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి మిల్లులకు తీసుకువెళితే, ఇదే అవకాశంగా భావించిన మిల్లు యజమానులు ఖరీప్‌ సీజన్‌ ప్రారంభంలో రెండు, మూడు రోజులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేసినా ఆ తర్వాత సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఇదే తంతుతో రైతులు నిలువునా మోసపోతున్నారు.

తక్కువ ధరకే విక్రయిస్తున్నారు

ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లేనందున రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లోని ధళారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నారు. మండలంలో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలు లేననందున రైతులు తప్పనిసరి పరిస్థితిలో దళారులకు విక్రయించాల్సి వస్తోంది. తేమ పేరు తో కూడా రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం, పత్తి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలి

– బాలునాయక్‌, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు

సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళతా

ఈ సారి పంట దిగుబడి బాగా నే ఉందని రైతులు అనందం తో ఉన్నారు. అయితే వర్షాలు వరుసగా కురుస్తున్నందున వారి ఆశలు నీరుగారుతున్నా యి. మండలంలో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలు లేనందున రైతు లు మద్దతు ధర పొందలేకపోతున్నారు. మండలంలో రైతు లు పడుతున్న సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రానున్న కాలంలో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తా.

– కవితకృష్ణానాయక్‌, వైస్‌ ఎంపీపీ, మఠంపల్లి

Updated Date - 2022-11-30T01:59:53+05:30 IST

Read more