వంతెన నిర్మించాలి : బీఎస్పీ

ABN , First Publish Date - 2022-10-07T05:43:30+05:30 IST

మండలంలోని బేతవోలు సమీపంలో ఉన్న సబ్బోరిగూడెం వద్ద వంతెన నిర్మించాలని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు కందుకూరి ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు.

వంతెన నిర్మించాలి : బీఎస్పీ
రాస్తారోకో చేస్తున్న బీఎస్పీ నాయకులు

చిలుకూరు, అక్టోబరు 6: మండలంలోని బేతవోలు సమీపంలో ఉన్న సబ్బోరిగూడెం వద్ద వంతెన నిర్మించాలని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు కందుకూరి ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు. బేతవోలు వీర్ల దేవి చెరువు వద్ద ఉన్న లోలెవల్‌ వంతెన వద్ద గురువారం రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర్లదేవి చె రువు వద్ద ఉన్న లోలెవల్‌ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహిస్తుం డడంతో రోడ్డు కోతకు గురవుతుంద న్నారు. చిలుకూరు నుంచి బేత వోలు, జెర్రిపోతులగూడెం, చెన్నారిగూడెం, ఆచార్యులగూడెం, పోలేనిగూడెం గ్రామాలకు వెళ్లే వాహనదారులు వంతన వద్ద ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా మహిళా కన్వీనర్‌ ఎర్రమల్ల నాగమణి, కందుకూరి గురవయ్య, వె ంపటి నాగమణి, కందుకూరి శ్రీనివాస్‌, దిలీప్‌, ముదిగొండ నాగయ్య, చిరంజీవి, వెంకన్న, హరికృష్ణ, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T05:43:30+05:30 IST