సాగర్ ఏరియా ఆస్పత్రిలో ఎముకల ఆపరేషన
ABN , First Publish Date - 2022-05-21T06:29:43+05:30 IST
నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఏ రియా ఆస్పత్రిలో అ త్యాధునిక పరికరాల తో ఎముకల ఆపరేషన్లు ప్రారంభమైన ట్లు ఆస్పత్రి సీఎంవో డాక్టర్ భానుప్రసాద్నాయక్ తెలిపారు.
మల్టీ ఫ్రాక్చర్ ఆపరేషన విజయవంతం
నాగార్జునసాగర్, మే 20: నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఏ రియా ఆస్పత్రిలో అ త్యాధునిక పరికరాల తో ఎముకల ఆపరేషన్లు ప్రారంభమైన ట్లు ఆస్పత్రి సీఎంవో డాక్టర్ భానుప్రసాద్నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఎముక ల ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దవూర మండంల పాల్తీ తండాకు చెందిన పాల్తీ మంగ్యా అనే వ్యక్తిని అతని కుమారుడు కొట్టడంతో రెండు కాళ్లు, కుడి చేయి, త లకు గాయాలయ్యాయి. అంతే కాకుండా రెండు కాళ్లకు, చేతికి ఎనిమిది చోట్ల ఎముకలు విరిగాయి. దీంతో సదరు వ్యక్తికి ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ రవికుమార్, హరికృష్ణలు రెండు గంటలు శ్రమించి మల్టీ ప్యాక్చర్ ఆపరేషన పూర్తి చేసినట్లు వివరించారు. ఈ ఆపరేషనలో వ్యక్తికి చోట్ల రాడ్లు, మరో రెండు ఎముకలు ప్లేట్లు వేసి స్ర్కూలు బిగించారని పేర్కొన్నారు. సాగర్ ఏ రియా ఆసుపత్రిలో చేసే ఎముకల ఆపరేషన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.